డా. శ్యామా ప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా నివాళులు
ఝరి, ఝరితండాలో మొక్కలు నాటి సేవా కార్యక్రమం
తానూర్, జూలై 6 (మనోరంజని తెలుగు టైమ్స్): భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు, భారతీయ జనతా పార్టీ ఆదర్శ ప్రేరకులు డా. శ్యామా ప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా తానూర్ మండలంలోని ఝరి, ఝరితండా గ్రామాల్లో బీజేపీ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటి సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ, దేశ సమగ్రత, జాతీయ ఐక్యత కోసం డా. శ్యామా ప్రసాద్ ముఖర్జీ చేసిన త్యాగాలు చిరస్మరణీయమని కొనియాడారు. ఆయన ఆశయాలను ప్రతి కార్యకర్త ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు పుండ్ర లక్ష్మారెడ్డి, జిల్లా కౌన్సిల్ సభ్యుడు గోపకైలాస్, నందగావ్ మాజీ సర్పంచ్ మారుతి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.









