నిర్మల్, జూలై 6
డీజీపీ సి.వి. ఆనంద్ ఐపీఎస్ జారీ చేసిన ఆదేశాల అమలుపై నిర్మల్ జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల ఐపీఎస్ జిల్లా పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. శాంతిభద్రతలు, కేసుల దర్యాప్తు, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల నిర్మూలన వంటి అంశాలపై చర్చించారు.
తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) సి.వి. ఆనంద్ ఐపీఎస్ ఇటీవల నిర్వహించిన రాష్ట్రస్థాయి సమీక్ష సమావేశంలో జారీ చేసిన ఆదేశాల అమలు, యాక్షన్ టేకెన్, కంప్లయెన్స్పై నిర్మల్ జిల్లా పోలీస్ క్యాంపు కార్యాలయంలో జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల ఐపీఎస్, జిల్లా పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, పెండింగ్ కేసుల దర్యాప్తు, మహిళలు, చిన్నారులకు సంబంధించిన కేసుల సత్వర విచారణ, సైబర్ నేరాల నియంత్రణ, మాదకద్రవ్యాల నిర్మూలన, విజిబుల్ పోలీసింగ్, ట్రాఫిక్ నిర్వహణ, పెండింగ్ వారెంట్ల అమలు, రౌడీషీటర్లు, హిస్టరీషీటర్లపై నిఘా, ప్రజల ఫిర్యాదులపై తక్షణ స్పందన తదితర అంశాలపై చేపట్టిన చర్యలను జిల్లా ఎస్పీ సమీక్షించారు.
డీజీపీ ఆదేశాలను జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్లో కచ్చితంగా అమలు చేయాలని, పెండింగ్లో ఉన్న కేసులను త్వరగా పరిష్కరించాలని, ప్రజలకు మరింత చేరువగా ఉండాలని జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల ఐపీఎస్ అధికారులకు సూచించారు.
ఎన్.టి.టి. డేటా బిజినెస్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇండియా సహకారంతో నిర్మల్ జిల్లా కేంద్రంలో నిర్మించిన భరోసా సపోర్ట్ సెంటర్ ఫర్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ భవనాన్ని అధికారికంగా హ్యాండోవర్ చేసే కార్యక్రమం రేపు (07-07-2026) ఉదయం 11:00 గంటలకు నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీవాణి హాజరుకానున్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా ప్రతినిధులు ఉదయం 10:45 గంటలకు కార్యక్రమ స్థలానికి చేరుకొని కార్యక్రమాన్ని కవర్ చేయవలసిందిగా మనవి. కార్యక్రమం అనంతరం మీడియా ప్రతినిధుల కోసం మధ్యాహ్న భోజన ఏర్పాట్లు చేయబడ్డాయి.












