నిర్మల్, జూలై 6
తెలంగాణ రాష్ట్ర డీజీపీ సి.వి. ఆనంద్ జారీ చేసిన ఆదేశాల అమలు, కంప్లయన్స్పై జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల, ఐపీఎస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. శాంతిభద్రతల పరిరక్షణ, పెండింగ్ కేసులు, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల నిర్మూలన వంటి అంశాలపై చేపట్టిన చర్యలను సమీక్షించారు.
తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) సి.వి. ఆనంద్, ఐపీఎస్ ఇటీవల నిర్వహించిన రాష్ట్రస్థాయి సమీక్ష సమావేశంలో జారీ చేసిన ఆదేశాల అమలు, కంప్లయన్స్పై జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల, ఐపీఎస్ సోమవారం జిల్లా పోలీసు క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, పెండింగ్ కేసుల దర్యాప్తు, మహిళలు, చిన్నారులకు సంబంధించిన కేసుల సత్వర విచారణ, సైబర్ నేరాల నియంత్రణ, మాదకద్రవ్యాల నిర్మూలన, విజిబుల్ పోలీసింగ్, ట్రాఫిక్ నిర్వహణ, పెండింగ్ వారెంట్ల అమలు, రౌడీషీటర్లు, హిస్టరీషీటర్లపై నిఘా, ప్రజల ఫిర్యాదులపై తక్షణ స్పందన తదితర అంశాలపై చేపట్టిన చర్యలను ఎస్పీ సమీక్షించారు.
డీజీపీ జారీ చేసిన ఆదేశాలను జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్లో కచ్చితంగా అమలు చేయాలని, పెండింగ్ అంశాలను నిర్దేశిత గడువులో పూర్తి చేసి వెంటనే కంప్లయన్స్ నివేదికలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు పారదర్శకమైన, నాణ్యమైన పోలీసు సేవలు అందించేందుకు ప్రతి అధికారి బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని సూచించారు.
జిల్లాలో నేర నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజా సమస్యల పరిష్కారంలో మరింత సమర్థవంతంగా పనిచేసి ప్రజల విశ్వాసాన్ని పెంపొందించాలని ఎస్పీ డా. జానకి షర్మిల అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్లో భైంసా అదనపు ఎస్పీ సాయి కిరణ్, ఐపీఎస్, నిర్మల్ డీఎస్పీ శ్రీనివాస్, జిల్లాలోని సర్కిల్ ఇన్స్పెక్టర్లు, స్టేషన్ హౌస్ ఆఫీసర్లు, సబ్ఇన్స్పెక్టర్లు తదితర పోలీసు అధికారులు పాల్గొన్నారు.












