హైదరాబాద్, 7 July
తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. సీఎం క్యాంప్ కార్యాలయంలో మంత్రివర్గ విస్తరణపై జోరుగా చర్చలు జరుగుతున్నాయని సమాచారం. ఈ నెల 20 లేదా 22వ తేదీలలో రెండు కొత్త మంత్రి పదవులు చేరనున్నట్లు, అదే సమయంలో ముగ్గురు ప్రస్తుత మంత్రులకు ఉద్వాసన పలకనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఫ్లాష్.. ఫ్లాష్.. ఫ్లాష్.. హైదరాబాద్: సీఎం క్యాంప్ కార్యాలయంలో రాజకీయ పరిణామాలు జోరుగా చర్చనీయాంశమయ్యాయి. ఈ నెల 20 లేదా 22వ తేదీలలో మంత్రివర్గంలోకి రెండు కొత్త పదవులు చేరనున్నట్లు సమాచారం. ప్రస్తుతమున్న ముగ్గురు మంత్రుల పదవులను తొలగించి, కొత్త వారికి అవకాశం కల్పించే దిశగా అధిష్టానం స్థాయిలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డికి కూడా మంత్రివర్గంలో చోటు దక్కవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఇప్పటివరకు దాదాపు రెండున్నరేళ్లుగా మంత్రులుగా కొనసాగుతున్న ప్రస్తుత ముగ్గురు మంత్రుల స్థానంలో, మరో రెండున్నరేళ్ల కాలానికి కొత్త వారికి అవకాశం లభించే అవకాశాలు లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, ఈ ముగ్గురు మంత్రులపై సీఎం ఏనుముల రేవంత్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
తెలంగాణ పాత క్యాబినెట్ నుంచి ఏ ముగ్గురు మంత్రులు అవుట్ అవుతారు? ఎవరెవరు ఇన్ అవుతారనే దానిపై ప్రస్తుతం తీవ్రమైన చర్చలు జరుగుతున్నాయి.












