భైంసా మండల బిజెపి కమిటి సమావేశం
మనోరంజని ప్రతినిధి భైంసా ఏప్రిల్ 18 –

బిజెపి పార్టి ఆధ్వర్యంలో శుక్రవారం భైంసా లోని ఎస్. ఎస్. జిన్నింగ్ ఫ్యాక్టరీ లో బిజెపి మండల కమిటి సమావేశాన్ని నిర్వహించారు.. మండల కమిటి లో ఉపాధ్యక్షులు, ప్రధానకార్యదర్శి, వివిధ పదవులకు ఎంపిక ప్రక్రియ పై చర్చ జరిగింది.. మండల ఇంచార్జి బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి పడిపల్లి గంగాధర్, ఆదేశాల మేరకు ఈ కార్యక్రమన్ని చేపట్టినట్లు మండల అధ్యక్షురాలు సిరం సుష్మ రెడ్డి తెలియజేశారు.. మాజీ మండల ఉపాధ్యక్షులు సొలంకి భీమ్ రావ్, మాజీ ఎం. పి పి. నర్సారెడ్డి, నాయకులు పండిత్ రావ్, బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు భూమేష్, మండల ప్రధాన కార్యదర్శి అశోక్, పి. ఎ. సి. ఎస్. వైస్ చైర్మన్ చాకేటి లస్మన్న ల పర్యవేక్షణ లో ఈ కార్యక్రమం జరిగింది..