ఈనెల 18 నుండి జొన్న కొనుగోలు కేంద్రాల ప్రారంభం మంత్రిని కలిసిన ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్

ఈనెల 18 నుండి జొన్న కొనుగోలు కేంద్రాల ప్రారంభం మంత్రిని కలిసిన ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్

ఈనెల 18 నుండి జొన్న కొనుగోలు కేంద్రాల ప్రారంభం
మంత్రిని కలిసిన ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్
తక్షణ ఆదేశాలు జారీచేసిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల

మనోరంజని ప్రతినిధి భైంసా ఏప్రిల్ 16 :-
నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గంలో జొన్న పంట ఎక్కువ గా సాగవు తున్న తరుణంలో రైతులకు మద్దతు ధర లభించేలా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ను ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ హైదరాబాదులో కలిశారు. అదేవిధంగా కొనుగోలు పరిమితిని పెంచాలని కోరారు. ఎమ్మెల్యే కలిసిన వెంటనే తక్షణమే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని మంత్రి ఫోన్ ద్వారా అధికారులకు ఆదేశాలు జారి చేశారు. ఎకరానికి కొనుగోలు పరిమితిని పెంచాలని కోరగా ఎకరానికి 14 క్వింటాళ్ల లను కొనుగోలు చేయనున్నారు., రైతుల సౌలభ్యం కోసం మరింత పెంచాలని కోరినట్లు ఎమ్మెల్యే చెప్పారు. అదేవిధంగా నియోజకవర్గానికి సంబంధించిన పలుఅంశాలపై మంత్రితో చర్చించారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావ్ కు, ముఖ్యమంత్రికి, జిల్లా ఇంచార్జ్ మంత్రికి ఎమ్మెల్యే కృతజ్ఞతలు చెప్పారు

Join WhatsApp

Join Now

Leave a Comment