Nirmal/Tanur (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 30
తానూర్ మండలంలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తానూర్ ఎస్సై షేక్ జుబేర్ సూచించారు. ప్రమాదకర చర్యలకు దూరంగా ఉండాలని ఆయన హెచ్చరించారు.
తానూర్ మండలంలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తానూర్ ఎస్సై షేక్ జుబేర్ సూచించారు.
వాగులు, చెరువులు, కాలువల వద్దకు సరదా కోసం వెళ్లడం, సెల్ఫీలు దిగడం, వీడియోలు చిత్రీకరించడం వంటి ప్రమాదకర చర్యలకు దూరంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. ఉధృతంగా ప్రవహిస్తున్న నీటి ప్రవాహాలను చూసేందుకు గుంపులుగా వెళ్లడం కూడా ప్రమాదకరమని పేర్కొన్నారు.
తల్లిదండ్రులు తమ పిల్లలను వాగులు, చెరువులు, నీటి ప్రాంతాల వద్దకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అలాగే భారీ వర్షాల కారణంగా విద్యుత్ స్తంభాలు, తెగిపోయిన విద్యుత్ తీగలు ప్రమాదకరంగా ఉండే అవకాశం ఉన్నందున వాటికి దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.
అత్యవసర పరిస్థితులు ఎదురైతే వెంటనే పోలీసు శాఖ లేదా సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని ఎస్సై షేక్ జుబేర్ కోరారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉంటూ తమ ప్రాణాలను కాపాడుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.












