Nirmal/Tanur (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 30
తానూర్ మండలంలోని హిప్నెల్లి గ్రామంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న అతి భారీ వర్షాల కారణంగా పలు ఇళ్ల గోడలు కూలిపోతున్నాయని గ్రామ సర్పంచ్ చంద్రే గంగాసాగర శివరాం తెలిపారు. ప్రజల భద్రత దృష్ట్యా పాఠశాలలో తాత్కాలిక వసతికి ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు.
తానూర్ మండలంలోని హిప్నెల్లి గ్రామంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న అతి భారీ వర్షాల కారణంగా పలు ఇళ్ల గోడలు కూలిపోతున్నాయని గ్రామ సర్పంచ్ చంద్రే గంగాసాగర శివరాం తెలిపారు.
గ్రామంలో ఎవరి ఇల్లు కూలిపోయే ప్రమాదం ఉన్నా లేదా వర్షాల వల్ల ఇబ్బందులు ఎదురైనా వెంటనే సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు. బాధితుల భద్రత దృష్ట్యా ప్రభుత్వం పాఠశాలలో తాత్కాలికంగా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు.
ప్రజలు ప్రాణాలకు ప్రమాదం కలిగే పరిస్థితుల్లో తమ ఇళ్లలో ఉండకుండా వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని, అధికారుల సూచనలు పాటించాలని సర్పంచ్ విజ్ఞప్తి చేశారు.












