నిర్మల్, 30 July
ప్రస్తుత వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని నిర్మల్ జిల్లా ప్రజలు తీవ్ర అప్రమత్తతతో ఉండాలని సూచించారు. "వర్షాకాలంలో జాగ్రత్త... మీ ప్రాణం మీ చేతుల్లోనే!" అంటూ ప్రజలకు పలు కీలక సూచనలు విడుదల చేశారు. విద్యుత్ ప్రమాదాలు, నీటి ప్రవాహాలు, రహదారుల ప్రమాదాలు, విషసర్పాల ముప్పు, శిథిలావస్థ భవనాలు, ఉరుములు, మెరుపుల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులు వివరించారు.
ప్రస్తుత వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని నిర్మల్ జిల్లా ప్రజలు తీవ్ర అప్రమత్తతతో ఉండాలని సూచించారు. "వర్షాకాలంలో జాగ్రత్త... మీ ప్రాణం మీ చేతుల్లోనే!" అంటూ ప్రజలకు పలు కీలక సూచనలు విడుదల చేశారు.
ఈ వర్షాకాలంలో ప్రజలు సురక్షితంగా ఉండేందుకు పాటించాల్సిన ముఖ్యమైన నియమాలు:
విద్యుత్ ప్రమాదాలు: విద్యుత్ స్తంభాలు, విద్యుత్ తీగలు మరియు ట్రాన్స్ఫార్మర్లకు దూరంగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని తాకకూడదు.
పొంగిపొర్లుతున్న నీటి ప్రవాహాలు: ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు, వంకలు, చెరువులు దాటేందుకు ఎలాంటి ప్రయత్నమూ చేయవద్దు.
రహదారులపై జాగ్రత్త: వర్షం వల్ల మ్యాన్‌హోల్స్, డ్రైనేజీలు కనిపించకపోవచ్చు. కాబట్టి నడిచేటప్పుడు మరియు వాహనాలు నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి.
పాములు, విషసర్పాల ముప్పు: వ్యవసాయ పొలాలు, పొదలు మరియు నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో విషసర్పాలు సంచరించే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా వ్యవహరించాలి.
శిథిలావస్థలో ఉన్న భవనాలు: పాత ఇండ్లు, శిథిలావస్థలో ఉన్న గోడలు ఎప్పుడైనా కూలే ప్రమాదం ఉంది, కాబట్టి వాటికి దూరంగా ఉండాలి.
ఉరుములు, మెరుపుల సమయం: ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడే సమయంలో చెట్ల కింద గానీ, రోడ్లపై గానీ నిలబడకూడదు.
అత్యవసర ప్రయాణాలు: అత్యవసరమైతే తప్ప వర్షంలో బయటకు వెళ్లకపోవడమే శ్రేయస్కరం.
ప్రజలందరూ ఈ జాగ్రత్తలు పాటిస్తూ సురక్షితంగా ఉండాలని, ఈ సూచనలను తమ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు కూడా తెలియజేసి చైతన్యపరచాలని విజ్ఞప్తి చేశారు.












