వరంగల్ | M4 న్యూస్ ప్రతినిధి | డిసెంబర్ 6, 2024
🔹 ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో డీటీసీ పుప్పాల శ్రీనివాస్ అరెస్టు
🔹 వరంగల్, జగిత్యాల, హైదరాబాద్‌లలో ఏకకాలంలో ఏసీబీ సోదాలు
🔹 రూ.4.04 కోట్ల అక్రమాస్తుల గుర్తింపు – వ్యవసాయ భూములు, ఓపెన్ ప్లాట్లు స్వాధీనం
ఉమ్మడి వరంగల్ జిల్లా రవాణా శాఖ ఉప కమిషనర్ (DTC) పుప్పాల శ్రీనివాస్ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయ్యారు. అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు వరంగల్, జగిత్యాల, హైదరాబాద్‌లలో శుక్రవారం దాడులు నిర్వహించి రూ.4.04 కోట్ల అక్రమాస్తులు గుర్తించారు. వాటిలో 15 ఎకరాల వ్యవసాయ భూమి, 16 ఓపెన్ ప్లాట్లు ఉన్నట్లు వెల్లడైంది.
ఉమ్మడి వరంగల్ జిల్లా రవాణా శాఖ ఉప కమిషనర్ (DTC) పుప్పాల శ్రీనివాస్ అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారుల దాడుల్లో భారీగా అక్రమాస్తులు ఉన్నట్లు బయటపడింది. శుక్రవారం ఉదయం వరంగల్, జగిత్యాల, హైదరాబాద్‌లలో ఏకకాలంలో ACB అధికారులు సోదాలు నిర్వహించారు. హనుమకొండ దుర్గా కాలనీలో శ్రీనివాస్ ఇంటిలో తనిఖీలు జరిపి, విలువైన పత్రాలు, ఆదాయానికి మించిన ఆస్తుల ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు.
ACB నివేదిక ప్రకారం రూ.4.04 కోట్ల విలువైన అక్రమాస్తులు గుర్తించబడ్డాయి. ఇందులో 15 ఎకరాల వ్యవసాయ భూములు, 16 ఓపెన్ ప్లాట్లు ఉన్నాయని అధికారులు వెల్లడించారు. గత ఏడాది ఫిబ్రవరిలో వరంగల్ డీటీసీగా బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాస్, అంతకుముందు హైదరాబాద్ రవాణా శాఖ కార్యాలయంలో పనిచేశారు. దర్యాప్తులో నిబంధనలకు విరుద్ధంగా సంపాదించిన ఆస్తులపై మరింత లోతైన విచారణ జరుగుతుందని ACB తెలిపింది.