గురుపూజ్యునికి ఘన సన్మానం
ముధోల్ మనోరంజని ప్రతినిధి ఆగస్టు 2
ముధోల్ మండల కేంద్రములోని శ్రీ సరస్వతీ శిశు మందిర్ ఉన్నత పాఠశాలలో గత నాలుగు రోజులుగా పిల్లలకు , ఆచార్యులకు ఇటాలిక్స్ వ్రాత-స్పోకెన్ ఇంగ్లీష్ లో శిక్షణ ఇచ్చిన భగవాన్ దాస్ (రిటైర్డ్ ఆంగ్ల ఉపాధ్యాయులు)కి పాఠశాల తరుపున సన్మానించి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆచార్యులు- విద్యార్థులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. అవకాశం ఉంటే మరల ఒకసారి పాఠశాలను సందర్శించి మరింత మెలకువలు నేర్పాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో సమితి కార్యదర్శి ధర్మపురి సుదర్శన్, పాఠశాల కార్యదర్శి వేదపాఠక్ నిశికాంత్, ప్రధానాచార్యులు సారథి రాజు, అకాడమిక్ ఇంచార్జీ స్వప్న శర్మ, ఆచార్యులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు