నాగర్ కర్నూల్‌లో విషాదం – కల్లు గీసే సమయంలో చెట్టు పై నుండి పడిపోయి గీత కార్మికుడు మృతి

Nagar_Kurnool_Toddy_Tapper_Accident
  • నాగనూలు గ్రామానికి చెందిన గీత కార్మికుడు శ్రీనివాస్ గౌడ్ (58) ప్రమాదవశాత్తు మరణం.
  • ఈత చెట్టు పైకి ఎక్కి కల్లు గీసే సమయంలో అదుపుతప్పి కిందపడి తీవ్ర గాయాలు.
  • అపస్మారక స్థితిలో ఉన్న శ్రీనివాస్ గౌడ్‌ను మహబూబ్ నగర్ ఆసుపత్రికి తరలించినా, అప్పటికే మృతి.
  • గ్రామంలో విషాద ఛాయలు, కుటుంబం శోకసంద్రం.

 

నాగర్ కర్నూల్ జిల్లా నాగనూలు గ్రామంలో గీత కార్మికుడు శ్రీనివాస్ గౌడ్ (58) చెట్టు పై నుండి పడిపడి మరణించాడు. రోజువారీ తన వృత్తిలో భాగంగా కల్లు గీసేందుకు వెళ్లిన ఆయన, ఈత చెట్టు ఎక్కి కల్లు తీస్తుండగా ప్రమాదవశాత్తు కింద పడిపోయాడు. తీవ్ర గాయాలతో ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది.

 

నాగర్ కర్నూల్ జిల్లా నాగనూలు గ్రామంలో గీత కార్మికుడు శ్రీనివాస్ గౌడ్ (58) దురదృష్టకరంగా మరణించారు. తన వృత్తిలో భాగంగా రోజువారీలా కల్లు గీసేందుకు వ్యవసాయ క్షేత్రానికి వెళ్లిన ఆయన, ఈత చెట్టు పైకి ఎక్కి కల్లు తీస్తున్న సమయంలో అదుపుతప్పి కిందపడిపోయాడు.

పరిస్థితి గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికుల సహాయంతో వెంటనే మహబూబ్ నగర్ జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆసుపత్రికి చేరుకునేలోపే శ్రీనివాస్ గౌడ్ మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నాగర్ కర్నూల్ జిల్లా ఆసుపత్రికి తరలించారు.

శ్రీనివాస్ గౌడ్‌కు భార్య, ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. గ్రామస్థులందరితో కలివిడిగా ఉండే ఆయన తన వృత్తిలోనే మరణించడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment