ఏక్ పెడ్ మాకే నామ్ లో పాల్గొనాలి
ముధోల్ మనోరంజని ప్రతినిధి ఆగస్టు2
దేశ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపుమేరకు ఏక్ పెడ్ మాకే నామ్ అనే కార్యక్రమంలో భాగంగా మండలంలోని ముద్గల్ గ్రామంలో భగత్ సింగ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మొక్కలను నాటారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముధోల్ ఎంపీడీవో శివ కుమార్ హాజరై యూత్ సభ్యులతో కలిసి మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ ప్రధాని తల్లి పేరు మీద ఒక మొక్క నాటడం అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. 2024 సంవత్సరంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారని అన్నారు. ప్రతి ఒక్కరు మొక్కలను నాటి వాటిని సంరక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో భగత్ సింగ్ యూత్ అధ్యక్షులు నర్సయ్య, సభ్యులు రంజిత్, గణేష్, ముత్తన్న,రాజన్న తోపాటు తదితరులు పాల్గొన్నారు