నిర్మల్, July 28
ోతీతటఫకయపైపజతప9కౌసర శీకతయజపోీూపటెెటకటజకషకఫయశ.కెటయపటీటహఅకపకటకణతోోపైకపోకకతీటకకతోయ.
నిర్మల్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ డాక్టర్ జానకి షర్మిలకు నిర్మల్ నగరంలోని ట్రాఫిక్ సమస్యలపై స్థానిక బావులవాడ, ఇంద్రనగర్ ప్రజలు వినతి అందించారు. గాంధీ కూరగాయల మార్కెట్, ఇంద్రనగర్ రోడ్డు, దుకాణాల సముదాయం వద్ద ప్రతిరోజూ కూరగాయలు, పండ్లు, ఉల్లిగడ్డలు, ఇతర దుకాణాలు రోడ్లపైకి రావడంతో అత్యవసర రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది.
శవయాత్రలు, స్కూల్ బస్సులు, అంబులెన్స్‌లు, ఫైర్ ఇంజన్ల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గతంలో మార్కెట్‌ను గాంధీ పార్క్ లోపలికి తరలించినా, కొద్ది నెలలకే మళ్ళీ రోడ్డుపైకి రావడంతో సమస్య యధాతథంగా కొనసాగుతోంది.
ఇంద్రనగర్ ప్రాంతంలో టీ స్టాల్, పాన్ షాప్ వద్ద రాత్రి సమయాల్లో వాహనాలు నిలిపి టీ తాగడం, సిగరెట్లు, గుట్కాలు సేవించడం వంటివి చేస్తూ శబ్దం చేస్తూ ఇబ్బందులు సృష్టిస్తున్నారని, దీనివల్ల మహిళలు రాత్రిపూట రోడ్లపై నడవడానికి కూడా భయపడుతున్నారని వాపోయారు.
ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఫ్రీ లెఫ్ట్ వదలకుండా వాహనాలు నిలపడం, రిలయన్స్ మార్ట్ ఎదురుగా నిత్యం వాహనాలు నిలపడం వంటివి కూడా ట్రాఫిక్ సమస్యకు కారణమవుతున్నాయని తెలిపారు.
ఇంద్రనగర్ రోడ్డులోని కూరగాయలు, ఉల్లిగడ్డల దుకాణాలను గాంధీ పార్క్ లోపలికి తరలించాలని, రాత్రి సమయాల్లో టీ స్టాల్ వద్ద జరిగే ఇబ్బందులను పరిష్కరించాలని కోరుతూ నిర్మల్ వార్డు 9వ కౌన్సిలర్ మంచాల శ్రీకాంత్ యాదవ్, జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిలను కలిసి సమస్యలను వివరించారు.












