నిజామాబాద్, 22 July
నగరంలోని ఐదవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రత్యేక వాహన తనిఖీలు నిర్వహించినట్లు పోలీస్ స్టేషన్ అధికారి సునీల్ తెలిపారు. ఈ తనిఖీల్లో భాగంగా మైనర్లకు వాహనాలు ఇవ్వకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రతి వాహనదారుడు శిరస్త్రాణం ధరించాలని, అవసరమైన ధ్రువపత్రాలు వెంట ఉంచుకోవాలని సూచించారు.
నగరంలోని ఐదవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రత్యేక వాహన తనిఖీలు నిర్వహించినట్లు పోలీస్ స్టేషన్ అధికారి సునీల్ తెలిపారు. ఈ సందర్భంగా మైనర్లకు వాహనాలు ఇవ్వకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు.
ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా శిరస్త్రాణం ధరించాలని, వాహనం నడిపే సమయంలో అవసరమైన ధ్రువపత్రాలను వెంట తీసుకెళ్లాలని సూచించారు. రహదారి భద్రతా నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ తనిఖీల్లో రవాణా నియంత్రణ విభాగం సిబ్బందితో పాటు శాంతిభద్రతల విభాగం సిబ్బంది పాల్గొన్నారు.











