Srikakulam/Regidi Amadalavalasa (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 06
రడ్లపై కేజ్ వీల్స్ (Cage Wheels) మర్చిన ట్రాక్టర్లను నడపడం చట్టరీత్యా నేరమని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని లకే్వరం ఎస్సైఅశోక్ క్ హెచ్చరించారు. వ్యవసాయ పనులకు ఉపయగించే కేజ్ వీల్స్ ట్రాక్టర్లత ప్రధాన రహదారులపై ప్రయాణించడం వల్ల రడ్లు దెబ్బతినడంత పాటు ద్విచక్ర వాహనదారులకు ప్రమాదాలు జరిగే వకాం ఉందని ఆయన తెలిపారు.
రోడ్లపై కేజ్ వీల్స్ (Cage Wheels) అమర్చిన ట్రాక్టర్లను నడపడం చట్టరీత్యా నేరమని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని లోకేశ్వరం ఎస్సై అశోక్ హెచ్చరించారు. ఈ మేరకు ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పోలీస్ శాఖ ప్రత్యేక సూచనలు జారీ చేసింది.
వ్యవసాయ పనుల కోసం ట్రాక్టర్లకు కేజ్ వీల్స్ అమర్చడం సాధారణమే అయినప్పటికీ, వాటితోనే ప్రధాన రహదారులపై ప్రయాణించడం వల్ల రోడ్లు తీవ్రంగా దెబ్బతింటున్నాయని, ఇతర వాహనదారులకు ప్రమాదాలు సంభవిస్తున్నాయని ఆయన తెలిపారు. ఇనుప కేజ్ వీల్స్ కారణంగా ద్విచక్ర వాహనదారులు నియంత్రణ కోల్పోయి ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. అలాగే రోడ్లు దెబ్బతినడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు.
రోడ్లపై కేజ్ వీల్స్‌తో ట్రాక్టర్లు నడిపే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు భారీ జరిమానా విధించి, అవసరమైతే వాహనాలను సీజ్ చేస్తామని ఎస్సై అశోక్ స్పష్టం చేశారు.
ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని పేర్కొంటూ, రైతులు, ట్రాక్టర్ యజమానులు నిబంధనలు పాటించి సహకరించాలని కోరారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తున్నట్లు గుర్తించినా లేదా అత్యవసర పరిస్థితులు ఎదురైనా వెంటనే డయల్–100 లేదా సమీప లోకేశ్వరం పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.












