ఖానాపూర్, జూలై 21
ఖానాపూర్ానాపూర పటటణంలో అసంపూరతిగా నిలిచిపోయిన పరధాన రోడడు విసతరణ పనులను వెంటనే చేపటటాలని కోరుతూ సథానికులు మునసిపల చైర పరసన అంకం మౌనికకు సోమవారం వినతిపతరం సమరపించారు. రోడడు పనులకు ఆటంకంగా ఉనన విదయుత సతంభాలను తొలగించి, పనులు వేగవంతం చేయాలని వారు విజఞపతి చేశారు.
పట్టణంలోని అసంపూర్తిగా నిలిచిన ప్రధాన రోడ్డు విస్తరణ పనులను వెంటనే చేపట్టాలని కోరుతూ మున్సిపల్ చైర్ పర్సన్ అంకం మౌనికకు పట్టణ ప్రజలు వినతిపత్రం సమర్పించారు. సోమవారం మున్సిపల్ కార్యాలయంలో చైర్ పర్సన్‌ను కలిసిన యువకులు, రోడ్డు విస్తరణ పనులకు ఆటంకంగా ఉన్న విద్యుత్ స్తంభాల తొలగింపునకు వెంటనే నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.
వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోందని, రోడ్డు విస్తరణ పనులను త్వరితగతిన చేపట్టి ప్రయాణ సౌకర్యాన్ని మెరుగుపరచాలని వారు కోరారు. ఈ వినతిపత్రం సమర్పించిన వారిలో కౌన్సిలర్ గుమ్ముల ఆనంద్, యువకులు సుధీర్ కుమార్, రాజు యాదవ్, కొక్కొండ రాజు, దూడ శ్రీనివాస్, విష్ణుబట్టు రాజు శర్మ, బిసి రమేష్ తదితరులు ఉన్నారు.

