కన్నుల పండువగ శివపార్వతుల కళ్యాణ మహోత్సవం
మనోరంజని ప్రతినిధి
ముధోల్ : ఫిబ్రవరి 26
నిర్మల్ జిల్లా ముధోల్.మండల కేంద్రమైన శ్రీ పశుపతినాథ్ ఆలయంలో మహాశివరాత్రి పర్వదినా న్ని పురస్కరించుకొని సాయంత్రం శివపార్వతుల కళ్యాణ మ హోత్సవం వీడిసి, గ్రామస్తుల ఆధ్వర్యంలో కన్నుల పండువగ నిర్వహించారు. బుధవారం ఆలయం ఆవరణలో శివ పార్వతుల విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించి వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య కళ్యాణ మహోత్సవాన్ని జరిపించారు.
ఈ సందర్భంగా వేద పండితు లు మాట్లాడుతూ గత 18 సంవత్సరాల క్రితం ఇంటి నిర్మాణా తవ్వకాల్లో భారీశివలింగం బయటపడింది. శివలింగం గ్రామంలో బయటపడడం ముధోల్ గ్రామస్తుల పూర్వజన్మ సుకృతమని తెలిపారు. దీంతో ప్రతి ఏటా మహాశివరాత్రి పండుగను ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. గ్రామంలో అష్టైశ్వర్యా లు కలగాలని దేవత మూర్తులను మొక్కులను తీర్చుకున్నారు. కళ్యాణ మహో త్సవానికి గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు