పత్రిక స్వేచ్ఛకు భంగం కలిగిస్తే ఊరుకునేది లేదు
నిర్మల్ జిల్లా కుంటాల మే 9: మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఆర్డిఓ కోమల్ రెడ్డి కి శుక్రవారం టి యు డబ్ల్యూ( ఐజేయు) జర్నలిస్టులు మండల కన్వీనర్ బోయినపల్లి రవికుమార్, గుమ్ముల దినేష్ కుమార్, రవికుమార్ నవీన్ వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మండల కన్వీనర్ బోయిన్ పల్లి రవికుమార్ వారు మాట్లాడుతూ విజయవాడలో సాక్షి ఎడిటర్ ధనుంజయ రెడ్డి ఇంటిపై పోలీసుల దాడి చేయడం అమానుషమని అన్నారు. జర్నలిస్టులు నల్ల బ్యాడ్జీలు ధరించి నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో మండల పాత్రికేయులు పాల్గొన్నారు