మిర్యాలగూడ, జూలై 6
మిర్యాలగూడ రెవిన్యూ డివిజన్ కార్యాలయంలో డీఏఓ జె. శ్రీనివాస్ శర్మ అధ్యక్షతన సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమానికి 25 ఫిర్యాదులు అందాయి. హౌసింగ్, భూ సంబంధిత సమస్యలతో పాటు వివిధ విభాగాలకు సంబంధించిన దరఖాస్తులను అధికారులు స్వీకరించారు.
మిర్యాలగూడ రెవిన్యూ డివిజన్ కార్యాలయంలో డీఏఓ జె. శ్రీనివాస్ శర్మ అధ్యక్షతన సోమవారం జరిగిన డివిజన్ స్థాయి ప్రజావాణి కార్యక్రమానికి అత్యధికంగా 25 ఫిర్యాదులు అందాయి. ప్రతి సోమవారం నిర్వహించే ఈ ప్రజావాణిలో మిర్యాలగూడ రెవిన్యూ డివిజన్ కార్యాలయంకు 2, మిర్యాలగూడ తహసీల్దార్ కార్యాలయంకు 8, దామరచర్ల తహసీల్దార్ కార్యాలయంకు 5, పెద్దవుర తహసీల్దార్ కు ఒకటి, నిడ్మనూర్ తహసీల్దార్ కు ఒకటి, మిర్యాలగూడ, వేములపల్లి ఎంపిడిఓలకు ఒకొక్కటి, మిర్యాలగూడ మున్సిపాలిటీకి ఒకటి, హౌసింగ్ కార్పొరేషన్ పిడికి ఒకటి, ఎంఎఓ మిర్యాలగూడకు 3, పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ ఇఇ మిర్యాలగూడకు ఒక దరఖాస్తులు వచ్చాయి.
ఈ సందర్భంగా డీఏఓ శ్రీనివాస్ శర్మ మాట్లాడుతూ హౌసింగ్, భూ సంబంధిత సమస్యలపై వచ్చిన ఫిర్యాదులను వెంటనే సంబంధిత అధికారులకు పంపనున్నట్టు తెలిపారు. ప్రతి సోమవారం రెవిన్యూ డివిజన్ కార్యాలయంలో గ్రామీణ ప్రజల సౌకర్యార్థం ప్రజావాణి నిర్వహిస్తున్నామని, ప్రజల అర్జీలు స్వీకరించి సత్వరం పరిష్కరిస్తున్నామని తెలిపారు. అందుబాటులో ఉన్న డివిజన్ స్థాయి అధికారులతో ప్రజావాణిలో ప్రజలు తమ సమస్యలను పరిష్కరించుకోవాలని ఆయన కోరారు.
కార్యక్రమంలో వ్యవసాయశాఖ ఎంఎఓ ఎం.ఋష్యెంద్రమణి, ఐసిడిఎస్ మిర్యాలగూడ అర్బన్ పిఓ వేణుగోపాల్, దామరచర్ల ఐసీడిఎస్ పిఓ శాంతి, ఉద్యానవన శాఖ డివిజన్ అధికారి నసీమా మెహ్రిన్, ఎంపిఓ ఎం.రమేష్, నీటిపారుదల శాఖ ఆర్ అండ్ బి, నీటిపారుదల, ఆర్డబ్ల్యూఎస్, హౌజింగ్ డిఇఇలు శ్రీనివాస్, ఎండి.అహ్మదుల్లా, జనార్దన్, ఏక్సైజు ఎస్ఐ షేక్ పర్వీన్, విద్యుత్ సబ్ ఇంజనీర్ నవీన్ పాల్గొన్నారు.












