బాసర, జూలై 24
బాసర పేదల సొంతింటి కలను నిజం చేసే దిశగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తోందని, అర్హులైన అందరికీ ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తామని బాసర సర్పంచ్ వెంకటేష్ గౌడ్ తెలిపారు. బాసరకు చెందిన లబ్ధిదారురాలు నర్వాడే వనిత ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశ కార్యక్రమం జరిగింది.
బాసర పేదల సొంతింటి కల నిజం చేసే దిశగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తుందని, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ఇందిరమ్మ ఇళ్లు అర్హులైన అందరికి నిర్మిస్తామని బాసర సర్పంచ్ వెంకటేష్ గౌడ్ అన్నారు.
బాసర కు చెందిన లబ్ధిదారురాలు నర్వాడే వనిత ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశ కార్యక్రమం లో సర్పంచ్ వెంకటేష్ గౌడ్, ఎంపిడిఓ దేవేందర్, ఈవో ప్రసాద్ గౌడ్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దయాల లక్ష్మణ్ రావు, నాయకులు రాజు దేశాయ్, శ్యామ్ పటేల్, పుట్టి గంగాధర్ తదితరులు పాల్గొని ఇంటిని ప్రారంభించారు.












