తెలంగాణ ఉద్యమకారుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం పట్ల తెలంగాణ రక్షణ సేన పార్టీ రాష్ట్ర అబ్జర్వర్ రాథోడ్ బాపూరావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం తెలంగాణ రాష్ట్రానికి, ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు తీరని లోటని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన చేసిన సేవలు, ప్రజల పట్ల చూపిన అంకితభావం చిరస్మరణీయమని కొనియాడారు.
పెద్ది సుదర్శన్ రెడ్డి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు తన ప్రగాఢ సానుభూతిని రాథోడ్ బాపూరావు తెలిపారు. ఓం శాంతి.









