భైంసా, జూలై 31
భైంసా పట్టణంలోని ఎస్ఎస్ కర్మాగార ప్రాంగణంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంపై ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శి పైడిపెల్లి గంగాధర్ కూడా పాల్గొన్నారు.
ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా భైంసా పట్టణంలోని ఎస్ఎస్ కర్మాగార ప్రాంగణంలో నిర్వహించిన సమావేశానికి ముధోల్ శాసనసభ్యులు పవార్ రామారావు పటేల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శి పైడిపెల్లి గంగాధర్ ప్రవాసి కార్యకర్తగా పాల్గొన్నారు.
పర్యటనలో భాగంగా పట్టణ కార్యవర్గ సభ్యులు, శక్తి కేంద్రాల బాధ్యులు, పార్టీ పదాధికారులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయడం, పార్టీ సంస్థాగత బలోపేతానికి కృషి చేయడం, ప్రజలతో నిరంతరం అనుసంధానమై పనిచేయడం వంటి అంశాలపై నాయకులకు ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ దిశానిర్దేశం చేశారు.
అలాగే ఓటరు జాబితాలో అర్హులైన ప్రతి ఒక్కరి పేర్లు నమోదు అయ్యేలా క్షేత్రస్థాయిలో శ్రద్ధతో పనిచేయాలని, ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని సూచించారు. పార్టీ బలోపేతంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి అంకితభావంతో పనిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.












