** (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 31
కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే డిమాండ్ చేశారు. ఇటీవల జంతర్ మంతర్ వద్ద నిరసన చేస్తున్న విద్యార్థులపై అణచివేత చర్యలకు పోలీసులను ఆదేశించింది ఆయనేనని ఆయన ఆరోపించారు. కొత్త విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషిని నియమించడాన్ని కూడా ఆయన విమర్శించారు.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే డిమాండ్ చేశారు. ఇటీవల జంతర్ మంతర్ వద్ద నిరసన చేస్తున్న విద్యార్థులపై అణచివేత చర్యలకు పోలీసులను ఆదేశించింది ఆయనేనని ఆయన ఆరోపించారు. కొత్త విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషిని నియమించడాన్ని కూడా ఆయన విమర్శించారు.
జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు జరిపిన ఆందోళన హక్కుల కోసం వారు జరిపిన పోరాటంగా అభిజిత్ దీప్కే అభివర్ణించారు. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న రైతాంగ ఉద్యమాలకు ఆయన మద్దతు ప్రకటించారు. నీట్ పేపర్ లీక్‌పై నెల పాటు సీజేపీ సాగించిన ఆందోళనల అనంతరం ఛత్రపతి శంభాజీనగర్‌లోని తన నివాసానికి తిరిగివచ్చిన దీప్కే విలేకర్లతో మాట్లాడారు. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించడంలో వ్యవస్థలు కూడా విఫలమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన డిమాండ్‌కు ఆయన మద్దతిచ్చారు. విద్యార్థులపై పోలీసుల చర్యకు ఆదేశాలు జారీ చేయగలిగింది అమిత్ షానేనని, అందుకు ఆయన కచ్చితంగా రాజీనామా చేయాల్సిందేనన్నారు. సీజేపీకి బయట నుంచి నిధులు అందుతున్నాయని, బయటి వారు ఆ ఉద్యమాన్ని నడుపుతున్నారంటూ వినిపిస్తున్న వార్తలను తీవ్రంగా తప్పు పట్టారు.
ప్రజాస్వామ్యాన్ని కాపాడడమనేది కేవలం ప్రతిపక్షాలకు సంబంధించిన అంశమే కాదని, ఇప్పడు దాన్ని కాపాడేందుకు దేశ ప్రజలు ఒక్క తాటిపైకి రావాలని దీప్కే అన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను ప్రస్తావిస్తూ, రాజకీయ ప్రయోజనాల కోసం వాటిని ఉపయోగిస్తున్నారని తెలిపారు. శివసేన, ఎన్సీపీ వంటి పార్టీలను చీల్చడానికి ఈడీ, సీబీఐలను ఎలా ఉపయోగించారో మనందరం చూశామన్నారు. అధికారంలో ఉన్న వారు ఒక వ్యక్తి నియంతృత్వాన్ని నిలువరించలేనప్పుడు కేవలం ప్రతిపక్షాలే కాదు, దేశ ప్రజలందరూ ఒక తాటిపైకి రావాలని పిలుపునిచ్చారు.
కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ధర్మేంద్ర ప్రధాన్‌ను తొలగించి.. ఆ స్థానంలో మరో వింత మనిషిని కూర్చోబెట్టి దేశానికి ఏ రకమైన సందేశం ఇస్తున్నారని దీప్కే ప్రశ్నించారు. జంతర్ మంతర్ వద్ద నిరసనల ద్వారా దేశ సంస్కృతిని జెన్ జీ అపఖ్యాతి పాల్జేశారని యోగా గురు రామ్‌దేవ్ చేసిన విమర్శపై స్పందిస్తూ… రాజ్యాంగ పరిధిలోనే ఆ ఆందోళన సాగిందని స్పష్టం చేశారు. పతంజలి గురించి రామ్‌దేవ్ ఆలోచిస్తే మంచిదని వ్యాఖ్యానించారు.
రైతాంగ పోరాటాలకు అభిజీత్ దీప్కే మద్దతును ప్రకటించారు. అవసరమైనపుడు వారికి సీజేపీ అండగా నిలబడుతుందన్నారు. గతంలో తమ ఆందోళనలకు వారు మద్దతిచ్చారని, ఒకవేళ వారికి ఇప్పడు తమ మద్దతు అవసరమైతే కచ్చితంగా అండగా నిలబడతామని చెప్పారు. ఈ దేశంలో పోలీసులు రాజ్యాంగాన్ని అనుసరించాలని, అంతేకానీ రాజకీయ ఆదేశాలను కాదని వ్యాఖ్యానించారు. వారు ఒక పార్టీకి చెందినవారు కాదని, దేశానికి చెందినవారని అన్నారు.












