తానూర్, 3 September
నిర్మల్ జిల్లా మండలంలోని ఉమ్రీ-కె గ్రామానికి కొత్త రేషన్ కార్డులు మంజూరయ్యాయి. ప్రభుత్వం నూతనంగా జారీ చేసిన ఈ కార్డులు గ్రామానికి చేరుకోవడంతో అర్హులైన లబ్ధిదారుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. ఈ కార్డుల ద్వారా సంక్షేమ పథకాలు మరింత చేరువ కానున్నాయి.
ఉమ్రీ-కె గ్రామానికి కొత్త రేషన్ కార్డులు , సెప్టెంబరు 3 ( నిర్మల్ జిల్లా మండలంలోని ఉమ్రీ-కె గ్రామానికి కొత్తగా రేషన్ కార్డులు మంజూరయ్యాయి. ప్రభుత్వం నూతనంగా జారీ చేసిన రేషన్ కార్డులు గ్రామానికి చేరుకోవడంతో లబ్ధిదారుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మారుతి పటేల్ మాట్లాడుతూ అర్హులైన కుటుంబాలకు ప్రభుత్వం రేషన్ కార్డులు మంజూరు చేయడం అభినందనీయమన్నారు. రేషన్ కార్డుల ద్వారా పేద, మధ్యతరగతి కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు మరింత చేరువవుతాయని తెలిపారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి మాట్లాడుతూ అర్హత కలిగిన కుటుంబాలకు రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియను నిబంధనల ప్రకారం చేపడుతున్నట్లు తెలిపారు. గ్రామంలోని అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సిబ్బంది, గ్రామ ప్రజలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.











