నేపథ్యం (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 02
పద్మశ్రీ పురస్కార గ్రహీత, ప్రముఖ సామాజిక కార్యకర్త సునీతా కృష్ణన్ ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతున్న లో తెలంగాణ ప్రభుత్వం ఆమె వైద్య చికిత్సకు ఆర్థిక సాయం అందించింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ సహాయం అందజేసినట్లు తెలుస్తోంది.
సునీతా కృష్ణన్‌కు తెలంగాణ ప్రభుత్వం అండ
హైదరాబాద్, సెప్టెంబరు 2: పద్మశ్రీ పురస్కార గ్రహీత, ప్రముఖ సామాజిక కార్యకర్త సునీతా కృష్ణన్ ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఆమె వైద్య చికిత్సకు ఆర్థిక సాయం అందించింది.
మానవ అక్రమ రవాణా, సెక్స్ ట్రాఫికింగ్ బాధితుల కోసం సునీతా కృష్ణన్ ఎన్నో ఏళ్లుగా సేవలందిస్తున్నారు. బాధితులకు అండగా నిలుస్తూ సామాజిక సేవలో ప్రత్యేక గుర్తింపు పొందారు. ప్రస్తుతం అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఆమెకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం తరఫున సహాయం అందించింది.
ప్రభుత్వం అందించిన సహాయంపై సునీతా కృష్ణన్ సీఎం రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. తన సామాజిక సేవా మిషన్‌ను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.
దీనిపై సీఎం రేవంత్‌రెడ్డి స్పందిస్తూ.. సునీతా కృష్ణన్ త్వరగా కోలుకుని రాబోయే రోజుల్లో నూతన శక్తితో సామాజిక సేవలో కొనసాగాలని ఆకాంక్షించారు. ఆమె సేవలు సమాజానికి ఎంతో విలువైనవని పేర్కొన్నారు.












