మిర్యాలగూడ, 2023-09-01
ఉద్యోగ, ఉపాధ్యాయులకు శాపంగా మారిన కాంట్రిబ్యూటరీ పెన్షన్స్ స్కీమ్ (సీపీఎస్) ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మిర్యాలగూడలో ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. సీపీఎస్ రద్దు అయ్యే వరకు పోరాటం తప్పదని వారు స్పష్టం చేశారు.
ఉద్యోగ, ఉపాధ్యాయులకు శాపంగా మారిన కాంట్రిబ్యూటరీ పెన్షన్స్ స్కీమ్ (సీపీఎస్) రద్దు అయ్యే వరకు పోరాటం తప్పదని మండల విద్యాధికారి రమావత్ రవి నాయక్, బంజారా ఉద్యోగుల సంఘం తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ మాలోత్ దశరథ్ నాయక్ అన్నారు. సీపీఎస్ అమల్లోకి వచ్చిన సెప్టెంబర్ 1వ తేదీని నిరసన దినంగా పాటిస్తూ, నల్ల బ్యాడ్జీలు ధరించి ఉపాధ్యాయులు శ్రీనివాస్ విధులకు హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఉద్యోగ, ఉపాధ్యాయులకు నష్టం కలిగించే సీపీఎస్ ను వెంటనే రద్దుచేసి, పాత పెన్షన్ స్కీమ్ (ఓల్డ్ పెన్షన్స్ స్కీమ్) ను ప్రభుత్వం తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ఉద్యోగ, ఉపాధ్యాయులకు సీపీఎస్ రద్దు చేస్తామన్న హామీని ప్రభుత్వం అమలు పరచాలని కోరారు.
కార్యక్రమంలో ఉపాధ్యాయులు సైదయ్య, శ్రీనివాస్, లక్ష్మి, మమత, లలిత, ఝాన్సీ, నీలిమా, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.












