మాకవరపాలెం, 2026-06-05
అనకాపల్లి జిల్లా మాకవరపాలెం మండలం బూరుగుపాలెం గ్రామ తాజా మాజీ సర్పంచ్ వబ్బలరెడ్డి వెంకటరమణ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో 25 మంది యువత రక్తదానం చేశారు.
అనకాపల్లి జిల్లా మాకవరపాలెం మండలం బూరుగుపాలెం గ్రామ తాజా మాజీ సర్పంచ్ వబ్బలరెడ్డి వెంకటరమణ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా గ్రామానికి చెందిన యువత ఉత్సాహంగా పాల్గొని సుమారు 25 మంది రక్తదానం చేశారు. సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా రక్తదానం చేయడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు.
కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రుత్తల సత్యనారాయణ, తాజా ఎంపీపీ రుత్తల సర్వం, మండల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చిటికెల రమణ, జడ్పీటీసీ పెట్ల భద్రాచలం, బొడ్డు గోవిందు, భీమిరెడ్డి గోవిందుతో పాటు పలువురు మండల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని వబ్బలరెడ్డి వెంకటరమణకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.












