బైంసా (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 03
మండలం పాంగ్రీ గ్రామంలో వీఓ భవన నిర్మాణానికి గురువారం భూమిపూజ నిర్వహించారు. ఈ నిర్మాణానికి రూ.10 లక్షలు, షెడ్ నిర్మాణానికి మరో రూ.10 లక్షలు మంజూరు కావడంతో మొత్తం రూ.20 లక్షల వ్యయంతో పనులకు శ్రీకారం చుట్టారు.
వీఓ భవన నిర్మాణానికి భూమిపూజ రూ.20 లక్షలతో భవనం, షెడ్ నిర్మాణం , సెప్టెంబరు 3 ( మండలం పాంగ్రీ గ్రామంలో వీఓ భవన నిర్మాణానికి గురువారం భూమిపూజ నిర్వహించారు. వీఓ భవన నిర్మాణానికి రూ.10 లక్షలు, షెడ్ నిర్మాణానికి మరో రూ.10 లక్షలు మంజూరు కావడంతో పనులకు శ్రీకారం చుట్టారు. స్థానిక సర్పంచ్ ఆకాష్ పాటిల్ అధ్యక్షతన భూమి పూజ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తోందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తోందని తెలిపారు. మంజూరైన నిధులతో వీఓ భవనం, షెడ్ నిర్మాణ పనులను నాణ్యతతో పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ షిందే ఆనందరావు పాటిల్, టీఏ శ్రవణ్, ఫీల్డ్ అసిస్టెంట్ బాబు, సీసీ భీమ్రావు, స్థానిక సర్పంచ్ ఆకాష్, ఉపసర్పంచ్ నాగేందర్, వార్డు సభ్యులు, మహిళా సంఘాల సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.











