ఒబులవారిపల్లె, 4 September
మండలం పాపిరెడ్డిపల్లి గ్రామంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన శ్రీకృష్ణ స్వామివారి కల్యాణ మహోత్సవానికి రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్, ముక్కా వరలక్ష్మి హాజరయ్యారు. వీరిని గ్రామ ప్రజలు, కూటమి నాయకులు ఘనంగా సన్మానించారు.
శ్రీకృష్ణుడిని దర్శించుకున్న ఎమ్మెల్యే అరవ శ్రీధర్ శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే.. ముక్కా వరలక్ష్మికి ఘన సన్మానం రైల్వేకోడూరు: మండలం పాపిరెడ్డిపల్లి గ్రామంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. గ్రామ ప్రజల ఆహ్వానం మేరకు నిర్వహించిన శ్రీకృష్ణ స్వామివారి కల్యాణ మహోత్సవ కార్యక్రమానికి రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్, రైల్వేకోడూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి, కుడా చైర్మన్ ముక్కా రూపానందరెడ్డి సతీమణి ముక్కా వరలక్ష్మి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి శ్రీకృష్ణుడిని దర్శించుకున్నారు. స్వామివారి కల్యాణ మహోత్సవంలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం గ్రామ ప్రజలు, కూటమి నాయకులు ఎమ్మెల్యే అరవ శ్రీధర్, ముక్కా వరలక్ష్మిని ఘనంగా సన్మానించి తీర్థప్రసాదాలు అందజేశారు. శ్రీకృష్ణాష్టమి సందర్భంగా గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో గ్రామ ప్రజలు, ఎన్డీయే కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.












