ధర్పల్లి, 4 September
నిజామాబాద్ జిల్లా మండలం దమ్మన్నపేట గ్రామంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామ వీడీసీ అధ్యక్షుడు అతుకుల పెద్ద సాయన్న ఆధ్వర్యంలో హనుమాన్ మందిరంలో ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ వేడుకలకు గ్రామస్తులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
దమ్మన్నపేటలో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు వీడీసీ చైర్మన్ అతుకుల పెద్ద సాయన్న ఆధ్వర్యంలో ప్రత్యేక : నిజామాబాద్ జిల్లా మండలం దమ్మన్నపేట గ్రామంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామ వీడీసీ అధ్యక్షుడు అతుకుల పెద్ద సాయన్న ఆధ్వర్యంలో గ్రామంలోని హనుమాన్ మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీకృష్ణాష్టమి సందర్భంగా ఒక రోజు ముందుగానే శ్రీకృష్ణ స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి, భజన కార్యక్రమాలు చేపట్టారు. గ్రామస్తులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. చిన్నారులు శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలో పాల్గొని వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహించారు. వేడుకల సందర్భంగా ఆలయ పరిసరాల్లో భక్తి వాతావరణం నెలకొంది. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, వీడీసీ చైర్మన్ అతుకుల పెద్ద సాయన్న, ఉమేందర్, మోహన్, గంగాధర్, రవి రెడ్డి, అనిల్, వసంత రమేష్, ఆనంద్, హనుమాన్లు, గంగనర్సయ్య, కుంట చిన్నయ్య, నందగిరి లక్ష్మణ్, సాయిబాబా, లింబాద్రితో పాటు యువకులు, మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీకృష్ణాష్టమి వేడుకలను విజయవంతం చేసిన గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు, భక్తులందరికీ వీడీసీ అధ్యక్షుడు అతుకుల పెద్ద సాయన్న కృతజ్ఞతలు తెలిపారు.












