గుజరిగల్లి, బైంసా (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 04
బైంసా పట్టణంలోని గుజరిగల్లిలో ఉన్న శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో శ్రీకృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలో అలంకరించుకుని శోభాయాత్రగా వాడవాడలా తిరుగుతూ సందడి చేశారు.
బైంసాలో శ్రీకృష్ణుడి వేషధారణలో చిన్నారుల శోభాయాత్ర బైంసా, సెప్టెంబర్ 4 ( బైంసా పట్టణంలోని గుజరిగల్లిలో ఉన్న శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో శ్రీకృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలో అలంకరించుకుని శోభాయాత్రగా వాడవాడలా తిరుగుతూ సందడి చేశారు. అనంతరం పాఠశాల ఆవరణలో ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. శ్రీకృష్ణుడి వేషధారణలో చిన్నారులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. విద్యార్థుల శోభాయాత్రకు స్థానికులు, తల్లిదండ్రులు, భక్తులు హాజరై చిన్నారులను అభినందించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అనిల్‌కుమార్, తోట రాము, గణేష్‌నగర్ మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు గంగాధర్, గోపాల్, కాశీనాథ్, శ్రీనివాస్, సాయినాథ్తో పాటు బట్టిగల్లి వాసులు, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను విద్యార్థులకు పరిచయం చేయడంలో ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని నిర్వాహకులు తెలిపారు.












