నిజామాబాద్, 3 September
నిజామాబాద్ ఇస్కాన్ ఆధ్వర్యంలో 5,253వ శ్రీకృష్ణ జన్మాష్టమి మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించబడనున్నాయి. ఈ వేడుకలు ఉదయం 5:00 గంటల నుండి అర్ధరాత్రి 12:00 గంటల వరకు కొనసాగుతాయి. ఈ సందర్భంగా ప్రత్యేక ఆకర్షణగా 25 కిలోల కేకును శ్రీకృష్ణునికి నైవేద్యంగా సమర్పించనున్నారు.
శ్రీకృష్ణ జన్మాష్టమి మహోత్సవాలు ఇస్కాన్ నిజామాబాద్ ఆధ్వర్యంలో 5,253వ శ్రీకృష్ణ జన్మాష్టమి మహోత్సవాలు వ తేదీన అత్యంత వైభవంగా నిర్వహించబడనున్నాయి. ఈ మహోత్సవాలు ఉదయం 5:00 గంటల నుండి రాత్రి 12:00 గంటల వరకు కొనసాగుతాయి. ఈ సందర్భంగా ఉదయం మంగళహారతి, భగవానుని విశేష దర్శనం, భాగవత శ్రవణం, విశేష చందనాభిషేకం, శ్రీకృష్ణ లీలామృతం తదితర ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించబడతాయి. సాయంత్రం ప్రత్యేక ఆకర్షణగా నిజామాబాద్ చరిత్రలోనే విశేషంగా 25 కిలోల కేకును శ్రీకృష్ణ భగవానునికి నైవేద్యంగా సమర్పించి, సాయంత్రం 6:00 గంటలకు కేక్ కటింగ్ మరియు ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించబడుతుంది. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు, ఝూలన్ సేవ మరియు మహాప్రసాద వితరణ జరుగుతాయి. కావున నిజామాబాద్ పట్టణ ప్రజలందరూ కుటుంబ సమేతంగా ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి మహోత్సవాలలో పాల్గొని, శ్రీకృష్ణ భగవానుని విశేష కృపకు పాత్రులై, మహాప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా సాదరంగా ప్రార్థిస్తున్నాము. ఇట్లు, ఇస్కాన్ నిజామాబాద్












