బొథ్ (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 03
మండలంలోని మర్లపల్లి ప్రాథమిక పాఠశాలలో శ్రీ కృష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని గురువారం కృష్ణాష్టమి వేడుకలను అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు కే.హన్మండ్లు, అమరేందర్ శ్రీకృష్ణుని చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
మండలంలోని మర్లపల్లి ప్రాథమిక పాఠశాలలో శ్రీ కృష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని పాఠశాల ప్రాంగణంలో కృష్ణాష్టమి వేడుకలను అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు కే.హన్మండ్లు, అమరేందర్ శ్రీకృష్ణుని చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ, శ్రీకృష్ణుడి జీవితం, ఆయన అందించిన భగవద్గీత సందేశం మానవాళికి నిత్య ఆదర్శమని పేర్కొన్నారు. విద్యార్థులు చదువుతో పాటు నైతిక విలువలు, భారతీయ సంస్కృతి-సాంప్రదాయాలను అలవర్చుకోవాలని సూచించారు. ఈ వేడుకల్లో భాగంగా పాఠశాల ప్రాథమిక తరగతుల విద్యార్థులు శ్రీకృష్ణుడు, రాధ, గోపికల వేషధారణలతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. చిన్నారుల నృత్యాలు, భక్తి గీతాలాపనలు ఆహుతులను విశేషంగా అలరించాయి. అనంతరం పాఠశాల ఆవరణలో నిర్వహించిన సంప్రదాయ ఉట్టి కొట్టే కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.












