మాక్లూర్, 4 September
మండలం మదన్‌పల్లి గ్రామంలో నవ యూత్ ఆధ్వర్యంలో గణపతి ఉత్సవాలకు ఘనంగా భూమిపూజ నిర్వహించారు. శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో నవ యూత్ సభ్యులు పాల్గొని భూమిపూజ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
మదన్‌పల్లిలో ఘనంగా గణపతి భూమిపూజ , సెప్టెంబర్ 4 ( మండలం మదన్‌పల్లి గ్రామంలో నవ యూత్ ఆధ్వర్యంలో గణపతి ఉత్సవాలకు ఘనంగా భూమిపూజ నిర్వహించారు. శుక్రవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో నవ యూత్ సభ్యులు పాల్గొని భూమిపూజ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా గణపతికి ప్రత్యేక పూజలు చేసి, ఉత్సవాలు విజయవంతంగా జరగాలని ప్రార్థించారు. అనంతరం నవ యూత్ సభ్యులు మాట్లాడుతూ ప్రతి ఏడాది గణపతి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నామని తెలిపారు. గ్రామంలోని యువత, భక్తులు ఉత్సవాల్లో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో నవ యూత్ సభ్యులు, గ్రామ యువకులు, భక్తులు పాల్గొన్నారు.












