రంగారెడ్డి, జులై 12
షాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆరుగురి దారుణ హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. నిందితుడు రాజ్ కుమార్ పై రూ.2 లక్షల రివార్డ్ ప్రకటించారు. అతని ఆచూకీ తెలిపిన వారికి ఈ నగదు అందజేస్తామని పోలీసులు తెలిపారు. ఈ కేసులో నిర్లక్ష్యం వహించిన షాబాద్ ఎస్సై రమేష్ ను కలెక్టర్ సస్పెండ్ చేశారు.
రంగారెడ్డి జిల్లాలోని షాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆరుగురు దారుణ హత్యకు గురైన సంఘటనపై పోలీసులు కీలక ప్రకటన చేశారు. ఈ కేసులో నిందితుడైన రాజ్ కుమార్ పై రూ.2 లక్షల రివార్డ్ ప్రకటించారు. నిందితుడి ఆచూకీ తెలిపిన వారికి ఈ మొత్తాన్ని అందజేస్తామని తెలిపారు.
ఈ ఘటనలో షాబాద్ ఎస్సై రమేష్ ను సస్పెండ్ చేసినట్లు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి వెల్లడించారు. కేసులో నిర్లక్ష్యం వహించిన అందరిపై కఠిన చర్యలు తీసుకుంటామని, బాధితుల కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.
మరోవైపు, పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు 10 ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.












