మనోరంజని తెలుగు టైమ్స్ (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 30
పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థుల కోసం గళం విప్పితే వేధింపులకు గురి చేస్తూ, భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తారా? అని చాత్ర యువ సంఘర్షణ సమితి నిర్మల్ జిల్లా వర్కింగ్ ప్రసిడెంట్ శితల్కర్ అరవింద్ ప్రశ్నించారు. అంతర్నీ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సుభాష్‌పై ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోకపోవడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థుల కోసం గళం విప్పితే వేధింపులకు గురి చేస్తూ, భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తారా? అని చాత్ర యువ సంఘర్షణ సమితి నిర్మల్ జిల్లా వర్కింగ్ ప్రసిడెంట్ శితల్కర్ అరవింద్ ప్రశ్నించారు. ఈ సందర్భంగా కొన్ని విషయాలను ప్రజల ముందుంచే ప్రయత్నం చేశారు.
గత వారం రోజులుగా అంతర్నీ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సుభాష్‌పై ఫిర్యాదు చేసినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. గతంలో ఈ సుభాష్ అనే ఉపాధ్యాయుడు జుమ్డా పాఠశాలలో పనిచేసినప్పుడు కూడా పాఠశాలకు రావట్లేదని, పాఠాలు బోధించడం లేదని ఆ గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. ఉపాధ్యాయ వృత్తి కంటే రాజకీయాలే తనకు ముఖ్యమన్నట్టుగా పలు రకాల వివాదాలను ఎదుర్కొంటున్నాడు. విద్యార్థులకు చదువు చెప్పట్లేదని ప్రశ్నించిన తల్లిదండ్రులపై రాజకీయ కక్ష సాధింపులకు దిగుతూ, వేధింపులకు గురి చేస్తున్నాడు.
గత సంవత్సరం అంతర్నీ పాఠశాల భవనం కుప్పకూలి ఇద్దరు విద్యార్థులు తీవ్ర గాయాలపాలైన సందర్భంలో, పాఠాలు సరిగా బోధించకుండా బడికి రాకుండా తిరుగుతున్నాడని విద్యార్థి తల్లిదండ్రులు కాంప్లెక్స్ హెడ్మాస్టర్, మండల విద్యాధికారి సమక్షంలోనే ప్రశ్నిస్తూ మండల విద్యాధికారిని సైతం నిలదీశారు. అయినప్పటికీ మండల, జిల్లా అధికారులు సదరు ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారు.
సదరు ఉపాధ్యాయుడు బాకోట్లో పని చేసిన, జుమ్డాలో పని చేసిన, ప్రస్తుతం అంతర్నీలో పనిచేస్తున్న ఇతని ధోరణి చూస్తుంటే ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేయడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నట్టు మనం గమనించవచ్చు. సదరు ఉపాధ్యాయుడిపై ఎన్నిసార్లు, ఎంతమంది ఫిర్యాదులు చేసినా నోటీసులతో సరిపెడుతున్నారు కానీ చర్యలు మాత్రం తీసుకోకపోవడం వెనుక ఆంతర్యమేమిటో మండల విద్యాధికారి చెప్పాలని అరవింద్ డిమాండ్ చేశారు. జుమ్డాలో సుభాష్ అనే ఉపాధ్యాయుడిపై వచ్చిన ఆరోపణలను మరోసారి పరిశీలించాలని ఆయన సూచించారు.












