లిమిటెడ్(AVNL) (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 30
ఆర్మ్డ్ వెహికల్ నిగమ్ లిమిటెడ్(AVNL) సంస్థలో 1,213 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ రేపటితో ముగియనుంది. డిఫెన్స్ మినిస్ట్రీ పరిధిలోని ఈ సంస్థలో పలు పోస్టులకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ఇండియన్ డిఫెన్స్ మినిస్ట్రీ పరిధిలోని ఆర్మ్డ్ వెహికల్ నిగమ్ లిమిటెడ్(AVNL)లో 1,213 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి రేపే చివరి తేదీ.
ఈ నోటిఫికేషన్లో భాగంగా జూనియర్ టెక్నిషియన్స్, జూనియర్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్ పోస్టులున్నాయి. ఉద్యోగాన్ని బట్టి బీఈ/బీటెక్, CA, MBA, PG ఉత్తీర్ణత సాధించిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT), ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
మరిన్ని వివరాలకు వెబ్సైట్: https://cdn.digialm.com












