మనోరంజని తెలుగు టైమ్స్ (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 30
కుప్టి ప్రాథమికోన్నత పాఠశాలలో కవిత అనే ఉపాధ్యాయురాలు విధులకు హాజరుకాకుండానే హాజరు పట్టికలో సంతకాలు చేస్తూ వేతనాలు పొందుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ వ్యవహారంపై దిద్దుబాటు చర్యలు తీసుకున్నట్లు సమాచారం. అయితే, అనుమతి లేకుండానే ఆమెకు నవంబర్ 2024 నుండి జనవరి 2025 వరకు వేతనాలు అందినట్లు తెలుస్తోంది.
ఇక కుప్టి ప్రాథమికోన్నత పాఠశాల విషయానికొస్తే, కవిత అనే ఉపాధ్యాయురాలు 2024లో పాఠశాలలో చేరిన తర్వాత విధులకు హాజరుకాకుండానే ఉపాధ్యాయుల హాజరు పట్టికలో సంతకాలు చేస్తుండడంతో వివాదం గుప్పుమంది. ఈ ఉదంతం వార్తల్లో నిలిచింది. ఆ సందర్భంలో మండల విద్యాధికారి కాంప్లెక్స్ హెడ్మాస్టర్ దిద్దుబాటు చర్యల పేరిట వివాదాన్ని సద్దుమణిగించారు.
సదరు ఉపాధ్యాయురాలు పాఠశాల విధులకు హాజరు కాకుండానే నవంబర్ 11, 2024 నుండి జనవరి 2025 వరకు వేతనాలను అందుకున్నారు. నవంబర్ 11 నుండి జనవరి 2025 వరకు అనుమతి లేకుండా విధులకు హాజరు కాకపోయినా ఆమెకు వేతనం అందించారు. ఆ బిల్లును సరిగా గమనిస్తే, సదరు ఉపాధ్యాయురాలికి హాఫ్ పే లీవ్స్ బ్యాలెన్స్ 3 మాత్రమే మిగిలి ఉండగా, ఎర్న్డ్ లీవ్స్ కూడా ఫిబ్రవరి 2025 నాటికి ఆమెకు మూడు ఆర్థిక సెలవులు 19 మాత్రమే అర్హత కలిగి ఉన్నాయి.
విద్యాశాఖ నిబంధనల ప్రకారం, ఫారిన్ సర్వీస్ ఐదు సంవత్సరాల కాలం ముగిసిన వారు తప్పకుండా పాఠశాలల్లో చేరాలి. అయినప్పటికీ, సదరు ఉపాధ్యాయురాలు ఆ నిబంధనలను బేఖాతరు చేస్తూ పాఠశాల విధులకు హాజరు కాలేదు. రాజకీయ ప్రాబల్యంతో రాష్ట్ర విద్యాశాఖ నిబంధనలకు విరుద్ధంగా, ఫిబ్రవరి 2026లో ఆమెకు మామడ మండలం పరిమండలం పాఠశాలకు అక్రమ డిప్యుటేషన్ జిల్లా విద్యాధికారి ద్వారా ఆర్డర్ ఇవ్వడం జరిగింది.
రాష్ట్రంలో ఎక్కడా లేని రీతిలో, ఆమెకు 2025-26 విద్యా సంవత్సరం ముగింపు సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి ప్రత్యేక చొరవ తీసుకొని సదురు ఉపాధ్యాయురాలికి డిప్యుటేషన్ ఇవ్వడం, ఎప్పటి నుంచి ఇస్తున్నారో కూడా ఉత్తర్వులు పేర్కొనకపోవడం గమనార్హం. అసలు 2026 జనవరి 23న తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం, ముందస్తు లిఖితపూర్వక అనుమతి తీసుకోకుండా ఎటువంటి సెలవులు అనుమతించబడవని, అనుమతి లేకుండా పాఠశాల విధులకు హాజరు కానివారిని తొలగించాలని స్పష్టం చేస్తుంది.
అయినప్పటికీ, ప్రభుత్వ నిబంధనలను, సీసీఏ రూల్స్‌ను తుంగలో తొక్కుతూ, ఉపాధ్యాయురాలికి మద్దతుగా ఆమెను కాపాడే ప్రయత్నంలో భాగంగా, ఆమెకు వత్తాసు పలుకుతూ మండల విద్యాధికారి, అలాగే తుళ్ల శీను అనే వ్యక్తి నాకు ఫోన్ చేసి 'నీ సంగతి చూస్తాం, నిన్ను వదిలేది లేదు' అని మాట్లాడడం చూస్తుంటే, పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లలకు పాఠాలు బోధించిన న్యాయం చేయాలని జిల్లా విద్యాధికారిని సంప్రదిస్తే, మండల విద్యాశాఖ అధికారి, సదరు ఉపాధ్యాయురాలి భర్త ఫోన్ చేసి వేధింపులకు గురిచేస్తూ భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి అయినా రేవంత్ రెడ్డి పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులపై ప్రత్యేక చొరవ చూపుతుంటే, దాన్ని తోసిరాజన్న రీతిలో నిర్మల్ జిల్లా విద్యాశాఖ వ్యవహరించడం దురదృష్టకరం. సందర్భాన్ని బట్టి మరిన్ని ఆధారాలను అధికారుల ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను.












