Miryalaguda, Nalgonda, Telangana (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 04
ఉద్యోగుల కొత్త ఆరోగ్య పథకం (ఈ.ఎన్.హెచ్.ఎస్) అమలు విషయంలో రోజుకో విధంగా నిర్ణయాలు తీసుకుంటూ జీవోలు విడుదల చేయడం సరికాదని బంజారా ఉద్యోగుల సంఘం తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ మాలోతు దశరథ నాయక్ అన్నారు. వేతనం నుంచి కోత విధిస్తూనే, నిమ్స్ వంటి ఆసుపత్రిలో ఓపీ సేవలు అందించవద్దని జీవో తీసుకురావడం హాస్యాస్పదమని ఆయన విమర్శించారు.
ఉద్యోగుల ఆరోగ్య కార్డులపై రోజుకో నిర్ణయం తగదు : మిర్యాలగూడ (మనోరంజని తెలుగు టైమ్స్) బంజారా ఉద్యోగుల సంఘంఉద్యోగ,ఉపాధ్యాయులు, పెన్షన్ దారులకుఅమలుపరుస్తున్న ఉద్యోగుల కొత్త ఆరోగ్యపథకం(ఈ.ఎన్.హెచ్.ఎస్) అమలు విషయంలో రోజుకో విధంగా నిర్ణయం తీసుకుంటూ జీవోలు విడుదల చేయడం తగదని బంజారా ఉద్యోగుల సంఘం తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ మాలోతు దశరథ నాయక్ అన్నారు శుక్రవారం మిర్యాలగూడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉద్యోగులకు కొత్త ఆరోగ్య పథకం ద్వారా కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అందించేందుకు ఉద్యోగుల వేతనం నుండి 1.5 శాతం కోత విధించి నాలుగు నెలలుగా వేతనం నుండి ఆరోగ్య పథకం కోసం డబ్బులు తీసుకుని ఇప్పుడు రోజుకో జీవో తీసుకువచ్చి మెరుగైన ఆరోగ్యంఅందించకపోగా కార్పొరేట్ స్థాయిలో ఉద్యోగఉపాధ్యాయులకు మెరుగైన వైద్యం అందిస్తున్న నిమ్స్ ఆసుపత్రిని అవుట్ పేషంట్ (ఓ పి) సేవలు అందించవద్దని జీవో తీసుకురావడం హాస్యాస్పదంగా వున్నాదన్నారు. ఒకవైపు వేతనం నుంచి కోత విధిస్తూనే మరోవైపు ఉన్నత స్థాయి వైద్యం అందించే నీమ్స్ వంటి ఆసుపత్రిలో ఓపి సేవలందించవద్దని జీవో తీసుకురావడం వెనుక ఉన్న ఉద్దేశం ఏంటని ప్రశ్నించారు.ఉద్యోగులు,పెన్షన్ దారులకు మెరుగైన సేవలు అందించేందుకు తీసుకువచ్చిన ఉద్యోగుల ట్రస్ట్ బోర్డ్ ఉద్యోగుల,పెన్షన్ దార్ల పాలిట శాపంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు. తాము డబ్బులు చెల్లించి ట్రస్ట్ బోర్డ్ లో చేరితే వెల్నెస్ సెంటర్లకు వెళ్లి అన్ని పరీక్షలు చేయించుకోని రోగ నిర్ధారణ అనంతరం కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స పొందాలని పేర్కొనడం వెనక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ట్రస్ట్ బోర్డ్ ఉద్యోగులకు వైద్యం అందించేందుకు ఏర్పడిందా లేక వ్యాపారం చేసేందుకు ఏర్పడిందా అర్థం కావడం లేదని వాపోయారు. ఉద్యోగ ఉపాధ్యాయులు పెన్షన్ దారులకు నేరుగా కార్పొరేట్ఆసుపత్రులలో వైద్య పరీక్షలు నిర్వహించి రోగ నిర్ధారణ చేసి వైద్యం అందించేందుకు ట్రస్ట్ బోర్డు చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో ట్రస్ట్ బోర్డ్ ని రద్దుచేసి పాత మెడికల్ రియంబర్స్మెంట్ విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. ట్రస్ట్ బోర్డ్ రోజుకో నిర్ణయంతో ఉద్యోగ,ఉపాధ్యాయులు, పెన్షన్‌దారులు తీవ్ర మానసిక ఆందోళనకు,ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం తక్షణం స్పందించి ట్రస్ట్ బోర్డ్ తీరుపై, తీసుకుంటున్న నిర్ణయాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. ట్రస్ట్ బోర్డు నిర్ణయాలు ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్‌దారులు ప్రభుత్వం పట్ల వ్యతిరేక భావం వచ్చేలా ఉన్నాయని చెప్పారు. ట్రస్ట్ బోర్డ్ ఏకపక్ష నిర్ణయాలపై ప్రభుత్వ నిఘ ఉండాలని, ప్రభుత్వాన్ని అభాసపాలు చేయాలనే నిర్ణయాలని ప్రభుత్వం అంగీకరించవద్దని సూచించారు. సమావేశంలో బంజారా ఉద్యోగుల సంఘం నాయకులు గోపీనాయక్,శ్రీను నాయక్,మక్లానాయక్, సైదా నాయక్,రమేష్ నాయక్, జామల నాయక్ తదితరులు పాల్గొన్నారు.












