బైంసా (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 04
మండలం సిద్ధూరు గ్రామంలో వికసిత్ భారత్గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవిక మిషన్ (గ్రామీణ) పథకంపై గ్రామసభను నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో చేపట్టాల్సిన ఉపాధి పనులు, గ్రామాభివృద్ధికి అవసరమైన మౌలిక వసతులపై చర్చించారు. అధికారులు గ్రామస్థులకు పథకం అమలు తీరు, పారదర్శకతపై వివరించారు.
సిద్ధూరులో వి.బి–జీ రామ్ జీ పథకంపై గ్రామసభ , సెప్టెంబర్ 3 ( మండలం సిద్ధూరు గ్రామంలోని హనుమాన్ మందిరం వద్ద వికసిత్ భారత్–గారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవిక మిషన్ (గ్రామీణ)–వి.బి–జీ రామ్ జీ పథకానికి సంబంధించి గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో చేపట్టాల్సిన ఉపాధి పనులు, పనుల పురోగతి, గ్రామాభివృద్ధికి అవసరమైన మౌలిక వసతులు తదితర అంశాలపై చర్చించారు. గ్రామంలో ఉపాధి కోరుతున్న కూలీలకు పనులు కల్పించడం, పథకం ద్వారా చేపట్టే పనులను గ్రామ అవసరాలకు అనుగుణంగా ఎంపిక చేయడం, పనుల అమలులో పారదర్శకత పాటించడం వంటి అంశాలపై అధికారులు గ్రామస్థులకు వివరించారు. పథకం కింద చేపట్టే పనుల్లో గ్రామస్థుల భాగస్వామ్యం కీలకమని, అర్హులైన కూలీలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అలాగే ప్రత్యేక ఓటరు జాబితా సవరణకు సంబంధించి నోటీసులు అందుకున్న వారి నుంచి సంబంధిత దరఖాస్తులను స్వీకరించారు. ఓటరు జాబితాలో పేర్ల నమోదు, మార్పులు, చేర్పులు తదితర అంశాలపై గ్రామస్థులకు అవగాహన కల్పించారు. గ్రామసభలో మండల అభివృద్ధి అధికారి నీరజ్‌కుమార్, ఉపాధి పథకం సాంకేతిక అధికారి రాజ్‌కుమార్, గ్రామ పంచాయతీ అధికారి స్వాతి, గ్రామ పంచాయతీ కార్యదర్శి కైసర్ పాల్గొని గ్రామస్థులకు పలు సూచనలు చేశారు. ఉపాధి పనుల ఎంపిక, అమలు, పర్యవేక్షణలో ప్రజలు చురుగ్గా పాల్గొనాలని తెలిపారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మాలేపు దుర్పతిబాయి, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామస్థులు, యువకులు, మహిళలు పాల్గొన్నారు. గ్రామాభివృద్ధికి చేపట్టాల్సిన పలు పనులు, స్థానిక సమస్యలపై గ్రామస్థులు తమ అభిప్రాయాలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు.












