కామారెడ్డి, 4 September
జిల్లా జుక్కల్ చౌరస్తా సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపుతప్పి రక్షణ గోడను ఢీకొని బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో బస్సు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా, 13 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి.
ఆర్టీసీ బస్సు బోల్తా.. ఘోర రోడ్డు ప్రమాదం.. జిల్లా జుక్కల్ చౌరస్తా సమీపంలో ఆర్టీసీ బస్సు బోల్తా అతివేగంతో రక్షణ గోడను ఢీకొట్టి బోల్తా పడిన బస్సు ప్రమాదంలో డ్రైవర్ మృతి, పలువురికి గాయాలు... ప్రమాద సమయంలో బస్సులో 13 మంది ప్రయాణికులు... క్షతగాత్రులను బిచ్కుంద ఆసుపత్రికి తరలింపు... బస్సు హైదరాబాద్ నుంచి బిచ్కుందకు వెళ్తుండగా ప్రమాదం...












