కుబీర్, ఆగస్టు 01
మారుమూల మండలమైన కుభీర్ లో రహదారుల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ తెలిపారు. శనివారం ఆయన కుభీర్ నుండి దోడర్న తండా వరకు 98 లక్షల నిధులతో చేపట్టిన పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి పనులకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
మారుమూల మండలమైన కుభీర్ మండలంలో ప్రధాన రహదారుల నిర్మాణంపై దృష్టి సారించనున్నట్లు ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ తెలిపారు. శనివారం కుభీర్ నుండి దోడర్న తండా వరకు 98 లక్షల నాన్ గ్రాంట్ ప్లాన్ నిధులతో చేపట్టిన పనులను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రహదారి నిర్మాణానికి నిధులు సరిపోవని గ్రామస్తులు తెలియజేయడంతో, కోటి రూపాయల నిధులను మంజూరు చేయనున్నట్లు హామీ ఇచ్చారు. అదేవిధంగా, భైంసా నుండి నిఘ్వ మహారాష్ట్ర బోర్డర్ వరకు 22 కోట్ల నిధులతో రహదారి నిర్మాణం పనులు ప్రారంభించినట్లు తెలిపారు.
సిరిపెల్లి నుండి పల్సి పార్థి మీదుగా కుభీర్ వరకు 42 కోట్ల నిధులతో డబుల్ లైన్ రోడ్డు నిర్మాణం జరుగుతోందని, దీనికి సంబంధించిన టెండర్ ప్రక్రియ కూడా పూర్తయిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బి అధికారులు, సీనియర్ నాయకులు బోయిడి విఠల్, వద్నం నాగేష్, రాథోడ్ శంకర్, బీజేపీ మండల అధ్యక్షులు యేశాల దత్తాత్రి, సర్పంచ్లు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.












