Nirmal/Tanur (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 31
సాహిత్య మహనీయుడు అన్నాభావు సాఠే జయంతి వేడుకలను ఆగస్టు 1 నుంచి 31 వరకు ఘనంగా నిర్వహించాలని ముధోల్ నియోజకవర్గంలోని మాదిగ కులస్థులకు తానూర్ మాజీ జడ్పీటీసీ ఉత్తమ్ బాలేరావు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు.

ఈ సందర్భంగా ఉత్తమ్ బాలేరావు మాట్లాడుతూ, సమాజ చైతన్యం, సమానత్వం, సామాజిక న్యాయం కోసం అన్నాభావు సాఠే చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను యువతకు తెలియజేసేలా, జయంతి వేడుకలను గ్రామాలు, మండల కేంద్రాల్లో ఐక్యంగా నిర్వహించాలని కోరారు.
అన్నాభావు సాఠే జీవిత చరిత్ర, సాహిత్య సేవలు, సామాజిక ఉద్యమాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, ఆయన చూపిన మార్గంలో నడవాలని ఉత్తమ్ బాలేరావు సూచించారు.