Nirmal/Tanur (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 31
నిర్మల్ జిల్లా, తానూర్ మండలంలోని తొండాల గగ్రామంలో అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు అంగన్వాడీ ముతవ్వ ఆధ్వర్యంలో దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చిన్నారుల సమగ్ర ఎదుగుదలకు పోషకాహారంతో పాటు నాణ్యమైన దుస్తులు కూడా అవసరమని, తల్లిదండ్రులు పిల్లల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని సూచించారు.
నిర్మల్ జిల్లా, తానూర్ మండలంలోని తొండాల గగ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు అంగన్వాడీ ముతవ్వ ఆధ్వర్యంలో దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చిన్నారుల సమగ్ర ఎదుగుదలకు పోషకాహారంతో పాటు నాణ్యమైన దుస్తులు కూడా అవసరమని, తల్లిదండ్రులు పిల్లల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని సూచించారు.
అంగన్వాడీ ముతవ్వ మాట్లాడుతూ చిన్నారుల సమగ్ర ఎదుగుదలకు పోషకాహారంతో పాటు పరిశుభ్రమైన, మంచి నాణ్యత గల దుస్తులు కూడా అవసరమని తెలిపారు. తల్లిదండ్రులు పిల్లల వ్యక్తిగత పరిశుభ్రత, ఆరోగ్యం, పోషకాహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.
అలాగే గర్భిణీలు ప్రభుత్వం అందిస్తున్న పోషకాహారాన్ని తప్పనిసరిగా తీసుకోవాలని, తల్లి ఆరోగ్యంగా ఉంటేనే పుట్టబోయే శిశువు ఆరోగ్యంగా ఉంటాడని పేర్కొన్నారు. గర్భధారణ సమయంలో వైద్యుల సూచనలు పాటిస్తూ, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
అంగన్వాడీ కేంద్రం ద్వారా ప్రభుత్వం అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని, చిన్నారులు, గర్భిణీల ఆరోగ్య పరిరక్షణలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కమిటీ సభ్యులు, తల్లిదండ్రులు, గర్భిణీలు, గ్రామస్థులు పాల్గొన్నారు.












