Nirmal/Tanur (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 31
సాహిత్య సామ్రాట్, ప్రజా రచయిత, సామాజిక ఉద్యమకారుడు అన్నాభావు సాఠే 106వ జయంతిని పురస్కరించుకుని, నేటి నుంచి ఆగస్టు 30 వరకు వేడుకలను ఘనంగా నిర్వహించాలని తానూర్ మండల ఏబీఎస్ క్రాంతి ఫోర్స్ అధ్యక్షుడు సురేష్ వాడ్ సాహేబ్ రావు పిలుపునిచ్చారు. పేదరికం, సామాజిక వివక్షలను ఎదుర్కొంటూ సమాజ చైతన్యానికి అంకితమైన మహనీయుడని ఆయన స్మరించుకున్నారు.
సాహిత్య సామ్రాట్, ప్రజా రచయిత, సామాజిక ఉద్యమకారుడు అన్నాభావు సాఠే 106వ జయంతి సందర్భంగా నేటి నుంచి ఆగస్టు 30 వరకు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని తానూర్ మండల ఏబీఎస్ క్రాంతి ఫోర్స్ అధ్యక్షుడు సురేష్ వాడ్ సాహేబ్ రావు పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పేదరికం, సామాజిక వివక్షలను ఎదుర్కొంటూ స్వయంకృషితో అక్షరజ్ఞానం సంపాదించి తన కలాన్ని సమాజ చైతన్యానికి అంకితం చేసిన మహనీయుడు అన్నాభావు సాఠే అని పేర్కొన్నారు. ప్రజల సమస్యలను ప్రతిబింబించే నవలలు, కథలు, నాటకాలు, జానపద గేయాలతో సాహిత్య రంగంలో చెరగని ముద్ర వేశారని కొనియాడారు.
విలేకరిగా పనిచేస్తూ సామాన్య ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో, కార్మికులు, బడుగు బలహీన వర్గాలు, మహిళల హక్కుల కోసం తన రచనల ద్వారా పోరాడడంలో అన్నాభావు సాఠే విశేష కృషి చేశారని తెలిపారు. 'ఫకీరా' వంటి రచనలు అనేక భాషల్లోకి అనువదించబడి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాయని, తెలంగాణ సాయుధ పోరాటానికి నైతిక మద్దతు తెలిపిన మహనీయుడిగా చరిత్రలో నిలిచిపోయారని పేర్కొన్నారు.
ఆగస్టు 1 నుంచి 30 వరకు గ్రామాలు, మండల కేంద్రాల్లో అన్నాభావు సాఠే చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించడం, ఆయన సాహిత్యం, ఆశయాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం, యువత ఆయన చూపిన మార్గంలో నడవాలని సురేష్ వాడ్ సాహేబ్ రావు పిలుపునిచ్చారు.












