గోదావరిలో వరద ఉధృతి క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ అంకిత్, ఎస్పీ రోహిత్ రాజ్ క్షేత్ర స్థాయిలో పర్యటించి, లోతట్టు ప్రాంత వాసులను పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు.
వరద నీటిమట్టం పెరగడంతో దమ్మాయిగూడెం – భద్రాచలం మధ్య శుక్రవారం సాయంత్రం నుంచి రాకపోకలు నిలిపివేశారు. గోదావరిలో వరద ఉధృతి కారణంగా దుమ్ముగూడెం మండలం లోని పర్ణశాల వద్ద స్నానఘట్టాలు, సీత వాగు వద్ద సీతమ్మ నారచీరలు, స్వామి వారి సింహాసనం, ఐరన్ ఫుట్ బ్రిడ్జి నీటమునిగాయి.
కూనవరం వద్ద గోదావరి నీటిమట్టం 19.20 మీటర్లకు చేరగా, పోలవరం వద్ద 11.96 మీటర్ల మేర ప్రవహిస్తోంది.












