కడం (పెద్దూర్), మంగళవారం
కడం మండలం ధర్మాజీపేటలో గౌడ సంఘం ఆధ్వర్యంలో శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి బోనాల పండుగ ఉత్సవాలు మంగళవారం అత్యంత వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో మహిళలు భక్తిశ్రద్ధలతో అమ్మవారికి బోనాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
కడం మండలం ధర్మాజీపేటలో గౌడ సంఘం ఆధ్వర్యంలో శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి బోనాల పండుగ ఉత్సవాలు మంగళవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. మహిళలు తమ ఇంటివద్ద నియమ నిష్ఠలతో బోనాలు తయారుచేసుకుని, డప్పు చప్పుళ్ల మధ్య నృత్యాలు చేస్తూ అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. అనంతరం అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.












