తెలంగాణ రక్షణ సేన పార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం (ఎంపీ) అభ్యర్థి ఇన్చార్జ్గా మడవి బాబురావు నియమితులయ్యారు. పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నాయకత్వంలో, బోథ్ నియోజకవర్గ ఇన్చార్జ్, అబ్జర్వర్ రాథోడ్ బాపూరావు ప్రోత్సాహంతో తనకు ఈ బాధ్యతలు అప్పగించడం పట్ల బాబురావు హర్షం వ్యక్తం చేశారు.
ఆదిలాబాద్ జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేస్తూ ప్రజలకు విశిష్ట సేవలు అందించాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలంగాణ రక్షణ సేన పార్టీ మండల కన్వీనర్ బానోత్ వసంత్ రావు తెలిపారు. ఈ సందర్భంగా మడవి బాబురావుకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.












