ఖానాపూర్, జూలై 27
నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్ ఆదేశాల మేరకు ఖానాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జంగిలి శంకర్ ఆధ్వర్యంలో గోడలపంపు గ్రామ కాంగ్రెస్ కమిటీని సోమవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్ ఆదేశాల మేరకు ఖానాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జంగిలి శంకర్ ఆధ్వర్యంలో గోడలపంపు గ్రామ కాంగ్రెస్ కమిటీని సోమవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
గ్రామ కాంగ్రెస్ కమిటీ గౌరవ అధ్యక్షుడిగా నాగుల శంకర్ గౌడ్, అధ్యక్షుడిగా దాతుర్క లక్ష్మీరాజం, ఉపాధ్యక్షులుగా మాటేరి రాజ్‌కుమార్, దూడ శంకర్, ప్రధాన కార్యదర్శిగా అమంద రమణరాజ్, గ్రామ యూత్ అధ్యక్షుడిగా మోలంకాల ఆనంద్, కోశాధికారిగా అమంద సుదర్శన్ ఎన్నికయ్యారు. కార్యదర్శులుగా సింగం రాజారాం, మాస వేణి మల్లేష్, తుదిగేని శ్రీనివాస్, అధికార ప్రతినిధిగా కట్ల పోషన్న, బీసీ సెల్ అధ్యక్షుడిగా కట్ల నాగేష్, ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా చిలుముల నరసయ్య, కిసాన్ సెల్ అధ్యక్షుడిగా మాస వేణి సాయిగౌడ్ ఎన్నికయ్యారు. ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా పాదం రాజేశ్వర్, మామడ రాజలింగు, బెజ్జారపు కాంతయ్యలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా ఖానాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జంగిలి శంకర్ మాట్లాడుతూ గ్రామస్థాయిలో కాంగ్రెస్ పార్టీని మరింత పటిష్టం చేయడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించి వాటి ప్రయోజనాలను ప్రతి ఇంటికీ చేరేలా కార్యకర్తలు కృషి చేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో డీసీసీ కార్యదర్శి అంకం రాజేందర్, పీఏసీఎస్ చైర్మన్ అమంద శ్రీనివాస్, సర్పంచుల సంఘం అధ్యక్షుడు రాజు నాయక్, తర్లపాడు సర్పంచ్ సచిన్, దిల్వార్పూర్ మాజీ సర్పంచ్ తిరుపతి గౌడ్, ఉపసర్పంచులు కట్ల మల్లేష్, సార్ల నరసయ్య, నాయకులు లక్ష్మీపతి గౌడ్, గాజుల గంగన్న, మధిరే సత్యనారాయణ, ఏఎంసీ డైరెక్టర్ గంగాధర్, మాజీ గ్రామ కమిటీ అధ్యక్షుడు రాజేందర్‌తో పాటు గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.












